శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఆగష్టు 27 జనంసాక్షి
మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం, కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి జాతర సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ…
గౌరవ కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత దేవాదాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు. అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని అన్నారు.
అంతకు ముందున్న ప్రభుత్వాలు ఆలయాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తు ధూప దీప నైవేద్యాలకు జీతాలు ఇస్తున్న ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అని అన్నారు.
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ అభివృద్ధికి మహబూబ్ నగర్, వనపర్తి జిల్లా మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అమయబ్రహ్మ కళాధర చారి, హైదరాబాద్ రెడ్డి మహిళ సంఘం అధ్యక్షురాలు విజయ రెడ్డి, కొత్తపేట డివిజన్ TRS మహిళ అధ్యక్షురాలు దేవిరెడ్డి శ్వేత రెడ్డి, దేవిరెడ్డి విజిత రెడ్డి, సరిత, దీప, విజయ, ప్రభ, నిర్మల, ప్రసన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.