షిండేకు నారాయణ లేఖ

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ సమస్యను ఒక నెలరోజులలోపు పరిష్కారిస్తామన్న కేంద్రమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన ప్రకటన పీఐబీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో లేకపోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన షిండేకు లేఖ రాశారు. పత్రికా ప్రకటనలో గడువుకాలాన్ని చెప్పకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. సాంకేతిక లోపంతో పత్రికా ప్రకటన వస్తే దాన్ని సరిదిద్దాలని ఆయన సూచించారు.