షిర్డీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అన్యాయం జరగదు.

హైదరాబార్‌: ఈరోజు మంత్రి శ్రీదర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ షిర్డీ బస్సు ప్రమాదంలో మృతుల బంధువులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని తెలిపారు. ప్రకటించిన పరిహారం కచ్చితంగా చెల్లించి తీరుతామన్నారు. త్వరలోనే రెవెన్యూ అధికారులు బాధిత బంధువులను కలిసి వివరాలు సేకరిస్తారని పేర్కొన్నారు.