షీటీమ్‌ల ఏర్పాటుతో కేసులు తగ్గాయి
రాష్ట్రంలో పోలీస్‌శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంది
మంత్రి నాయిని నర్సింహారెడ్డి
హైదరాబాద్,అక్టోబర్26(జనంసాక్షి): రాష్ట్రంలో షీటీంల ఏర్పాటుతో మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆర్టీసీ కళాభవన్‌లో షీటీమ్స్ 3వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, స్వాతి లక్రా, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయిని షీటీమ్ ఈ-లర్నింగ్, షీటీమ్స్ ఫర్ మి వెబ్‌సైట్లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ షీటీమ్‌ల ఏర్పాటుతో రాష్ట్రంలో మంచి మార్పువచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ పోలీస్‌శాఖకు అధిక ప్రధాన్యతనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 షీటీంలు పనిచేస్తున్నాయని తద్వారా మహిళల వేధింపులపై తగ్గాయన్నారు. రాష్ట్రంలో రౌడీలు, గుండాలు లేకుండా చేశామని నాయిని తెలిపారు. రాష్ట్రంలో పోలీసులు నిరంతరం కష్టపడి శాంతిభద్రతలను కాపాడుతున్నారని పోలీస్‌శాఖను నాయిని అభినందించారు. అనంతరం షీటీమ్స్ ఇన్‌చార్జ్ స్వాత్రి లక్రా మాట్లాడుతూ షీ టీమ్స్ ఏర్పాటుతో చాలా వరకు కేసులు తగ్గాయన్నారు. నేరాలను అదుపు చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. నేర రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం సీపీ మహేమందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ షీటీంలను ప్రారంభించి దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు భద్రత కల్పిస్తున్నామని అన్నారు. దీంతో షీటీంతో నేరాలు తగ్గాయిని తెలిపారు. షీటీమ్‌లపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, పోలీస్‌శాఖకు ప్రభుత్వ సహకారం అద్భుతంగా ఉందని సీపీ పేర్కొన్నారు. ప్రధాని కూడా పోలీస్‌శాఖ పనితీరును అభినందించారు. అందరి సహకారంతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందిన్నారు.



