సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ధర్నా

నల్గొండ, కలెక్టరేట్‌: అసంఘటిత రంగ కార్మికులకు రంగాల వారిగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అసంఘటిత కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆయా రంగాలకు విడుదల చేసిన కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పీఎఫ్‌ పథకం వర్తింప చేయాలని, జిల్లా కేంద్రంలో పీఎఫ్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గుర్తింపు కార్డుల ప్రమాద భీమా ఫించన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అసంఘటిత కార్మికులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు అవుట రవిందర్‌, ఎండీ సలీం, అందకి నర్సింహ, లతీవ్‌పాపాష, గుండమళు, శ్రీను, ఎన్‌కే సాదుల్లా, కాశమ్మ, ఎల్లమ్మ, సుగుణమ్మ, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.