సంగ్మా పిటిషన్‌ను తిరస్కరించిన ఈసీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ అభ్యర్థిత్వంపై సంగ్మా దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ప్రణబ్‌ నామినేషన్‌ను తిరిగి పరిశీలించాలిని సంగ్మా బృందం ఈసీని కోరింది. అయితే ప్రణబ్‌ నామినేషన్‌ పత్రాలు సక్రమంగానే వున్నట్టు ఈసీ పేర్కొంది. దీంతో సంగ్మా డిమాండ్‌ను ఈసీ తోసిపుచ్చింది.