సంపూర్ణ మద్య నిషేధం చేయాలి

తొర్రూరు, మే 26, (జనంసాక్షి): ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన సంపూర్ణ మద్యం నిషేదం అమలు చేయాలని పీివో డబ్యూ జిల్లా కార్యదర్శి డిమాండ్‌ చేసింది. శుక్రవారం మండల కేం ద్రంలోని సబ్‌ డివిన్‌ కమిటీ ఆధ్వర్యం లో ఎక్సైజ్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా జిల్లా కార్యదర్శి అనసూరయ్య మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా చేసిన అమలును ఆచరణలో పెట్టాలని లేదంటే మహిళ లోకం ఆగ్రహానికి గురికావల్సివస్తుందన్నారు. ఆదాయం సమకూరలంటే ప్రజలను తాగుబోతులుగా మార్చడ మేననా అన్ని ప్రశ్నించారు. మధ్యాంధ్రాప్రదేశ్‌గా మారుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం లో సంపూర్ణ మద్యచేయాలని వారు ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో సబ్‌డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నిర్మల, విజయ, మంగక్క, తదితరులు పాల్గొన్నారు.