-->

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ చీర సారే అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
-ప్రతి పండుగలో ప్రభుత్వ భాగస్వామ్యం
-తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం
-ఖండాంతరాలకు విస్తరించిన ప్రకృతి ఆరాధన
-బతుకమ్మ తో విశ్వవ్యాప్తిమైన తెలంగాణ సంస్కృతి
-ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలోనే అధికారికంగా నిర్వహణ
-కోటి మంది ఆడ పడుచులకు 350 కోట్లతో బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ
-అర్హులందరికీ ఆసరా పింఛన్లు
-దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
కొండమల్లేపల్లి (జనం సాక్షి ):సెప్టెంబర్ 25
సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రం నిలయమని దేవరకొండ శాసన సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆసరా పింఛన్లు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగని, ఆడబిడ్డలకు కానుక అందించడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి చూపాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ గారు బతుకమ్మ చీరల పంపిణీకి సంకల్పం ఇచ్చారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో నిరుపేద మహిళలు సైతం బతుకమ్మ పండుగకు కొత్త చీరలు కట్టుకొని మురిసిపోతున్నారని అన్నారు. పూలనే దేవతగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెక్కడ లేదని ఆయన అన్నారు. బతుకమ్మ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు పెద్దన్నగా బతుకమ్మ పండుగకు సారేగా చీరను కానుకగా అందిస్తూ గొప్ప లౌకిక వాదిగా పేరుగాంచారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అందుతున్నాయని ఆయన అన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అర్హులందరికీ పింఛన్ కార్డులు ఇచ్చే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు.ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణా ఉద్యమం తో ఖండాంతరాలకు విస్తరించిందని ఆయన చెప్పుకొచ్చారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని ఉద్యమ సమయంలో ముందుకు తేవడమేనని ఆయన కొనియాడారు. అందుకే వచ్చిన తెలంగాణా లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే మొట్టమొదటి సారిగా బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు.అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరల పంపిణీని చేపట్టినట్లు ఆయన తెలిపారు. మహిళల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న ఆదరాభిమానాలకు ఇది చక్కటి ఉదాహరణగా ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఈ బతుకమ్మ పర్వదినోత్సవ సందర్భంగా కోటి మంది ఆడ పడుచులకు 350 కోట్లతో బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు.అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య,ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి ,జడ్పీటీసీ పసునూరి సరస్వతమ్మ,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్,రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి, సిరందాసు కృష్ణయ్య,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,వెంకట్ రెడ్డి, గుండెబోయిన లింగం,రమావత్ బీమ్ సింగ్,ఎంపీటీసీ వాస్కుల తిరుపతమ్మకాశయ్య,గంధం సురేష్,రమావత్ రాములు,నేనావత్ శంకర్ నాయక్,రమావత్ శ్రీను నాయక్,రమేష్,దిప్ల,బోడ్డుపల్లి కృష్ణ,రూప్ల నాయక్,బాలు నాయక్,భద్రు నాయక్,ఎంపీడీఓ బాలరాజు రెడ్డి,తదితరులు పాల్గొన్నారు