సచివాలయ ముట్టడికి తెదేపా కార్పొరేటర్ల యత్నం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఈ రోజు సచివాలయ ముట్టడికి యత్నించారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తూ తెదేపా కార్పొరేటర్లు సచివాలయ ముట్టడికి యత్నించారు.



