సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా ప్రజా పోరాటాలలో పాల్గొనాలి

 – జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి            హుజూర్ నగర్ సెప్టెంబర్ 1 (జనంసాక్షి): హుజూర్ నగర్ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో  సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ నర్సింగ్ సత్యనారాయణ సంతాప సభను పట్టణంలో నిర్వహించారు. గురువారం ఈ కార్యక్రమానికి నాగారపు పాండు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సి పి యం పార్టీ సూర్యపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు మామిడి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ నర్సింగ్ సత్యనారాయణ పార్టీలకు అతీతంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించిన రాజకీయ నాయకుడని, పేదల కొరకు కుటుంబ అభివృద్ధిని పట్టించుకోకుండా పట్టణంలో ప్రజా సేవ చేసినటువంటి నాయకుడని అన్నారు. నేడు ఉన్నటువంటి పరిస్థితులలో బిజెపి మొత్తం పార్టీలను నిలువరించుట కొరకు లౌకిక తత్వా వాదులు అంతా ఒక తాటిపైకి వచ్చి కార్పొరేట్ రాజకీయాలకు తెర లేపుతున్నారని అటువంటి రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. నర్సింగ్ సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా ప్రజా పోరాటాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, పోసనబోయిన హుస్సేన్, శీలం శీను, రేపాకుల మురళి, జక్కుల నాగేశ్వరావు, గొట్టే రామయ్య, గల్ల వెంకటేశ్వర్లు, నర్సింగ్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ త్రివేణి, పాశం.వెంకట్ నారాయణ, చిన్నం. వీరమల్లు, లింగమ్మ, జే. వెంకటేశ్వర్లు, పి.నాగేశ్వరావు, పర్వతాలు, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.