సత్యసాయి సేవా సమితి సమాజానికి ఆదర్శం.
సత్యసాయి సేవా సమితి సమాజానికి ఆదర్శం.- ఎంపీపీ సంతోషం రమాదేవి.నెన్నెల, మార్చ్ 25, (జనంసాక్షి )
సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శమని నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి అన్నారు. నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం శ్రీ సత్యసాయి సేవా సమితి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులను పొందిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారం అందజేసి మాట్లాడారు. నేటి రోజులలో మానవ సంబంధాలు దూరం అవుతున్న వేళ మానవ సేవయే మాధవ సేవ అనే అంశం పై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విద్యార్థుల ఆలోచనలో మార్పు తీసుకొస్తుందని ఆకాంక్షించారు. స్థానికంగా సత్యసాయి సేవా సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. వేసవి కాలంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, సంస్థ సభ్యులకు సూచన చేశారు. అనంతరం ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో కూడా కోవిడ్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అభినందించారు. మంచి కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సింగతి శ్యామల, ఎంపీటీసీ పురం శెట్టి తిరుపతి, మండల కో ఆప్షన్ ఇబ్రహీం, మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, ప్రధానోపాధ్యాయుడు కాసర్ల నారాయణ, నాయకులు సంతోషం ప్రతాప్ రెడ్డి, సింగతి రాంచందర్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.