సబ్‌ కలెక్టర్‌గా దివ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నల్గొండ: భూవనగిరి సబ్‌ కలెక్టర్‌గా దివ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవోగా పనిచేస్తున్న ముత్యంరెడ్డికి పోస్టింగ్‌ ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాల్సిందిగా అందులో పేర్కొంది. 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన దివ్యను శిక్షణ అనంతరం భువనగిరి సబ్‌ కలెక్టర్‌గా నియమించారు. దీంతో భువనగిరి డివిజన్‌కు 4ఏళ్ల తర్వాత మళ్లీ ఐఏఎస్‌ అధికారి సబ్‌ కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.