సమయపాలన పాటించండి

విజయనగరం, జూలై 18 : నిత్యం రద్దీగా ఉండే విజయనగరం-చీపురుపల్లి ప్రాంతాల మధ్య నడిచే ఉదయం వేళ బస్సులు సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థినీ విద్యార్థులు బుధవారం ఉదయం ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. దీని వల్ల తమకు తీవ్ర అసౌకర్యంగా ఉందని వారు విమర్శించారు. అందువల్ల అధికారులు కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని వీరు కోరారు.