సమైక్యరాష్ట్రానికి కట్టుబడి ఉండాలి : గాదె వెంకటరెడ్డి

న్యూఢిల్లీ : సమైక్యరాష్ట్రానికి కట్టుబడి ఉండాలని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు కాంగ్రెస్‌ తరపున భేటీకి హాజరైన ప్రతినిధి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి వదిలి వేసినట్లు ఆయన చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు.