సమ్మెకు మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ

share on facebook
ఝరాసంగం ఆగస్టు 5 (జనంసాక్షి)
మండల కేంద్రమైన ఝరాసంగం తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్ ఆధ్వర్యంలో నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హన్మంత్ రావు పాటిల్ మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన జీ.ఓ తో పాటు హామీలను వెంటనే నెరవేర్చలన్నారు. అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. 12 రోజులుగా సమ్మె చేస్తున్న  పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో అర్థం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శంకర్ పాటిల్, మండల మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రుద్రప్ప పాటిల్, జడ్పీటీసీ వినీల  నరేష్ కుమార్, నాయకులు రాజ్ కుమార్, అమృత్, పెంటయ్య, సోహెల్, బాలన్న, శివన్న, ఇస్మాయిల్ సబ్, నవాజ్ రెడ్డి, నబీ పటేల్, నిజాం పాటిల్, పాష పాటిల్, బండప్ప, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
 

Other News

Comments are closed.