సమ్మె విరమించి విధుల్లో చేరితేనే చర్చలు జరుపుతాం
హైదరాబాద్|: జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి, విధుల్లో చేరితేనే మళ్లీ వారితో చర్చలు జరుపుతామని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రత్నకిషోర్ స్పష్టంచేశారు. రోగులకు ఇబ్బందులు కలిగిస్తే ఎస్మా ప్రయోగానికి వెనుకాడబోమని హెచ్చరించారు. జూడాలు పదేపదే సమ్మెకు దిగడం భావ్యం కాదని, ఇప్పటికే ప్రభుత్వం వారి సమస్యలపై సానుకూలంగా ఉందని చెప్పారు. డిమాండ్లన్నింటినీ పరిష్కరించేందుకు సోమవారం హామీ ఇచ్చామని తెలిపారు. మంగళవారం చర్చలకు ఆహ్వానించినప్పటికీ జూడాలు రాలేదన్నారు. సమ్మె నిషిద్ధమైనప్పటికీ జూడాలు పదేపదే ఉల్లంఘిస్తున్నారని వైద్యసేవలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని రత్నకిషోర్ వివరించారు.



