సరిహద్దులో ఉద్రిక్తత

తడ: రాష్ట్ర సరిహద్దు తడ మండలం కారూరు, తమిళనాడు పరిధిలోని నొచొకుప్పం మధ్య గత మూడు రోజులుగా చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఆదివారం మరోమారు ఉద్రిక్తత నెలకొంది. కారూరుకు చెందిన ఓ దుకాణంలో వ్యక్తిని నొచికుప్పం గ్రామస్థులు కొట్టారని సమాచారం రావటంతో వారంతా జాతీయరహాదారిపైకి వచ్చి  ఆందోళన చేపట్టారు. పోలీసులు సర్థిచెబుతున్నారు.