సర్వాయ్‌పేట చెరువులో ఇద్దరు గల్లంతు

కోటపల్లి: మండలంలోని సర్వాయ్‌పేట గ్రామ సమీపంలోని బంగారుకుంట చెరువులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గురువారం సాయంత్రం పశువుల కాపరి బాలయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యుడు చిలుకయ్య గాలింపు కోసం చెరువులో దిగాడు. అయితే ఇద్దరి ఆచూకీ లేక పోవటంతో గ్రామస్థులు అధికారులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చురుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.