సాంకేతిక లోపంతో నిలిచిపోయిన వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌

అనంతపురం: ఓఖా-ట్యుటికోరిస్‌ మధ్య  నడిచే వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఈ రైలు సోమందేపల్లి మండలం నడింపల్లి వద్ద గంటనుంచి నిలిచిపోయింది. తాగునీరు కూడా లేదంటూ రైలు ప్రయాణీకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.