”సాగరహారానికి” వచ్చిన వారు రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలి: కోదండరాం

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న నెక్లెస్‌ రోడ్డులో రాత్రి 11 గంటలకు కూడా స్వల్ప ఉద్రిక్తత నెలకొని ఉంది. సాగరహారానికి వచ్చిన వారు రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం పిలుపునివ్వడంతో ఆందోళనకారుల్లో కొందరు అక్కడే ఉండిపోయారు. దీంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు తెలంగాణ వాదులను అక్కడి నుంచి చెదరగొట్టేందుకు అప్పుడప్పుడు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగిస్తున్నారు. అంతకుముందు తెలంగాణ కవాతుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి సమయం ముగిసినా నిర్వాహకులు మాత్రం ఈరాత్రంతా ఇక్కడే కూర్చుందామని ప్రకటించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.