సాగర్‌ నీళ్లు నల్లగొండ ప్రజల ఆస్తీ : కేటీఆర్‌

నల్లగొండ: నాగార్జున సాగర్‌లో ఉన్న నీళ్లు నల్లగొండ జిల్లా ప్రజల ఆస్తి అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కే తారక రామారావు అన్నారు. అసలు జాతీయ, అంతర్జాతీయ, న్యాయసూత్రాల ప్రకారం సాగర్‌ నీళ్లు మొదట తాగడానికి వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు మొదట తాగడానికి ఈ నీళ్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా జలాలపై తెలంగాణ ప్రజలకు హక్కు ఉంది. మానీళ్లు మాక్కావాలని అడిగితే సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలు డెల్టా రైతులకు వ్యతిరేకమనే భావనను సీమాంధ్ర ప్రజల్లో కలిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సాగర్‌ నీటి మట్టం 512అడుగులు ఉండాలన్న నిబంధనను తుంగలో తొక్కిందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు.