సాగునీటి రంగంలో స్వర్ణయుగం

` రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా?
` బిజెపి, కాంగ్రెస్‌లకు బుద్ది చెప్పండి
` 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఒరిగిందేవిూ లేదు
` ఐటి రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ
` నిజామాబాద్‌ లాంటి పట్టణాలకు ఐటిని విస్తరించాం
` ధరణితో రైతులకే అధికారం ఇచ్చాం
` పెట్టుబడులతో పెరిగిన రాష్ట్ర ఆదాయం
` కరెంట్‌ సమస్యలు పరిష్కరించుకుని ముందుకు సాగాం
` నెల రోజుల్లో బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తా
` బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం
` రైతుల సంక్షేమం కోసమే రైతు బంధు, రైతు బీమా
` కాంగ్రెస్‌ వస్తే కచ్చితంగా దళారీల రాజ్యం వస్తోంది
` రాష్ట్రంలో పోడు భూముల పట్టాలను పంపిణీ చేశాం
` ప్రజలు ఆలోచించి అభ్యర్థులకు ఓటు వేయాలి
` ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌
ఆదిలాబాద్‌/నిజామాబాద్‌/బోథ్‌/నర్సాపూర్‌ (జనంసాక్షి):బిజెపి, కాంగ్రెస్‌లతో దేశానికి రాష్టాన్రికి ఒరిగిందేవిూ లేదని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఈ రెండు పార్టీలను అధికారానికి దూరంగా పెట్టాలన్నారు. బిఆర్‌ఎస్‌ మాత్రమే నిఖార్సయిన ప్రజల పార్టీ అంటూ..మరోమారు బిఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్పపై పారేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. బీజేపీకి ఓటువేస్తే ఓటేస్తే మోరీల పారేసినట్లేనని.. కాంగ్రెస్‌కు వేయడం కూడా ఇంకా వేస్టేనని అన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. జోగు రామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’50 సంవత్సరాల కాంగ్రెస్‌ పార్టీ లోయర్‌ పెన్‌గంగా అని ఊరించారు. ప్రతి ఎలక్షన్‌లో ప్రామిస్‌ చేసుడే. ఒకే ఒక్కడు జోగురామన్న తన మాట నెలబెట్టుకొని చనకా కొరటా బ్యారేజీని పూర్తి చేయించాడు. ఆదిలాబాద్‌ చరిత్రలో ఎవరూ చేయలేదు. జోగు రామన్న ఒక్కడే నా వెంబడి పడి.. నన్ను కూడా పెన్‌గంగ కాడికి తీసుకువచ్చి చనకా కొరటా చేయిస్తున్నడు. దాదాపు పంపుహౌస్‌లు, కాలువలు పూర్తయ్యాయి. డిస్టిబ్యూట్రరీ కాలువలు తవ్వుకుంటున్నాం. మంచిగా 50`51వేల ఎకరాలకు నీళ్లు వస్తయ్‌. చనకా కొరటా కాలువ నుంచే పిప్పల్‌కోట్‌ రిజర్వాయర్‌కు లింక్‌ ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌ జమానలో 8వేల ఎకరాలు పారలే. జోగు రామన్న వచ్చి కాలువలను రిపేర్‌ చేయిస్తే చివరిదాకా నీళ్లు అందుతున్నయ్‌. కాంగ్రెస్‌ పట్టించుకోని వాటిన్నంటిని బీఆర్‌ఎస్‌ చక్కదిద్దింది. చెడగొట్టినవన్నీ మంచిగ చేస్తున్నది. కాంగ్రెస్‌ జమానలో కరెంటు లేదు. తెల్లందాక కొద్దిగా.. పొద్దందాక కొద్దిగా.. లోవోల్టేజీ.. మోటలు కాలడం అనేక బాధలు ఉండేది. జోగు రామన్న ఉత్తమమైన వ్యక్తి. సామాన్యమైన వ్యక్తి. ఎమ్మెల్యే అంటే పకర్‌ లేదు. పొద్దంతా ఆయన ఇంటినిండా జనం జాతరలే ఉంటది. అద్భుతంగా ప్రజల్లో కలిసుండే వ్యక్తి. జోగురామన్నను మెజారిటీతో గెలిపించాలి. ఆయన ఆదిలాబాద్‌కు చాలా తీసుకువచ్చాడు. సార్‌ మా జిల్లాలో ఇంజినీరింగ్‌ కాలేదని నాతో కొట్లాడి ఇంజినీరింగ్‌ కాలేజీ తెచ్చాడు. అగ్రికల్‌ కాలేజీ, పాలిటెక్నికల్‌ కాలేజీ తెచ్చిండు. ఆదిలాబాద్‌ అభివృద్ధి కావాలంటే జోగు రామన్నతో అయితది ఇంకెవడితో కాదు’ అన్నారు. బీజేపీ భారతదేశంలో 150 మెడికల్‌ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు జిల్లాకోటి ఇవ్వాలని చట్టం ఉన్నా ఇవ్వలేదు. ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటుకూడా బీజేపీకి ఎందుకు వేయాలి? ఇవాళ బీజేపీకి ఓటువేస్తే మోరీలపరేసినట్లే అవుతుంది. వేస్ట్‌ తప్పా మనకు పనికివచ్చే గవర్నమెంట్‌ కాదు. ఈ రోజు హిందువులు, ముస్లింలు, కైస్త్రవులు అన్నదమ్ముళ్ల కలిసి ప్రేమతో ముందుకెళ్లే రాష్ట్రం ఇది. సదర్మాట్‌ను నిజాం రాజు కట్టాడు. ఎన్నో చెరువులు కట్టించారు. అందరం ఆనాటి నుంచి ఈనాటి దాకా కలిసున్నాం. ఇప్పుడు కలిసే ఉండాలి. మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్ప విూద పారేయాలి. బీజేపీకి ఒక్కవోటు వేసిన వేస్టే. కాంగ్రెస్‌కు వస్తే ఇంకా వేస్టే. రాబోయే రోజు ప్రాంతీయ పార్టీలదే. గ్యారంటీగా రాసిపెట్టుకోండి. వచ్చేతాప మోదీకి మెజారిటీ రాదు. సంకీర్ణ ప్రభుత్వమే వస్తది. అసెంబ్లీలోనే కాదు.. పార్లమెంట్‌ సీటు కూడా ప్రతీ ఒక్కటీ గెలవాలి. అప్పుడు మన తడాఖా ఢల్లీిలో చూపించే అవకాశం వస్తది. మన హక్కులన్నీ పరిరక్షించబడుతయ్‌. ఇవన్నీ గమనంలో పెట్టుకొని మంచి మనసుతో పెద్ద మెజారిటీ ఇచ్చి జోగురామన్నను గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు. సభలో జోగు రామన్న, వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.
ఐటి రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ
నిజామాబాద్‌:రాష్ట్రంలో ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చి పెట్టుబడులు సమకూర్చుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నాం. త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితికి పోతున్నాం. పెట్టుబడులు పెరిగాయి, రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. అంతేకాకుండా నిజామాబాద్‌ లాంటి పట్టణాలకు ఐటిని విస్తరించామని అన్నారు. దీంతోఎ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వచ్చాయన్నారు. తెలంగాణ వచ్చిన నాడు మన ర్యాంకు ఇండియాలో 19 ఉండే. ఇవాళ 3 లక్షల 18 వేలతో తసలరి ఆదాయంలో ఇండియాలో నంబర్‌ వన్‌గా ఉన్నాం. ఈ పదేండ్ల కష్లంతో అక్కడి దాకా వచ్చాం అని కేసీఆర్‌ తెలిపారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.మన వద్ద నీటి తిరువా రద్దు చేశాం. ఏడాదిన్నర లోపే కరెంట్‌ సమస్యను పరిష్కరించుకున్నాం. 24 గంటల కరెంట్‌ రైతాంగానికి ఫ్రీగా ఇస్తున్నాం. రైతుబంధు అనే పథకం గురించి జమానాలో వినలేదు. గత గవర్నమెంట్‌ రూపాయి ఇవ్వలేదు.. ఆలోచించలేదు. మొట్టమొదటిసారి రైతుబంధును పుట్టించిందే కేసీఆర్‌. ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందుతుంది. రైతులు పండిరచిన ధాన్యాన్ని కొంటున్నాం. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే వారంలోపే 5 లక్షల బీమా ఇస్తున్నాం. వీటితో రైతుల ముఖాలు తెల్లవడుతున్నాయి అని కేసీఆర్‌ తెలిపారు. రైతుబంధు దుబారానో లాభమో రైతులు తేల్చాలి. మూడు గంటల కరెంట్‌ సరిపోతదని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంట్‌ ఉండాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. రైతులందరూ 10 హెచ్‌పీ మోటార్‌ పెట్టుకోవాలని రేవంత్‌ అంటున్నారు. 3, 5 హెచ్‌పీ మోటారు ఉంటది రైతుల వద్ద. ఇప్పుడు 10 హెచ్‌పీ మోటార్‌ ఎవడు కొనియ్యాలా..? వాడి అయ్యా కొనియ్యాల్నా.. యాడికెళ్లి రావాలి. మన వద్ద 30 లక్షల మోటార్లు ఉన్నాయి. ఆలోచించాలి. కరెంట్‌ బిల్లు ఏంది.. ఎన్ని అవస్థలు.. ఎన్ని లంచాలు గతంలో. ఇవాళ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలడం లేదు. ఏ బాధ లేదు. మంచిగా రైతు పండిరచుకున్నంత చేతికి డబ్బులు వస్తున్నాయి. ఈ పద్ధతి పోవాలని అంటున్నారు కాంగ్రెసోళ్లు. వారు చాటుకు చెప్తలేరు.. టీవీ ఇంటర్వ్యూల్లో భాజప్తా చెబుతున్నారు. వీటి గురించి ఆలోచించాలి అని కేసీఆర్‌ సూచించారు.  ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా.. ఈ పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనను, 50 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనను బేరిజు వేసుకుని, ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.మన దేశానికి స్వాతంత్యర్ర వచ్చి 75 ఏండ్లు అవుతుంది. కానీ ప్రజాస్వామ్య పక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదు. ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. ఆలోచన చేయాలి. మంచేదో చెడేదో గుర్తించాలి. ప్రజలు గెలిచినప్పుడే వారి ఆకాంక్షలు నెరవేరుతాయి అని కేసీఆర్‌ అన్నారు. ఈ రోజు బీఆర్‌ఎస్‌ తెలంగాణ తెచ్చిన తర్వాత విూ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి వచ్చి పదేండ్ల నుంచి పరిపాలన చేస్తున్నాం. ఈ పదేండ్లలో ఏం జరిగింది..? 50 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏం జరిగింది..? అనేది బేరీజు వేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో నిధులు, నీళ్లు లేవు. కరెంట్‌ లేదు. రైతులు, చైనేతల ఆత్మహత్యలు. వలసలు పోవుడు. చాలా భయంకరమైన బాధలు. మూడు నాలుగు నెలలు మెదడు కరగదీసి, ఒక ప్రణాళిక వేసుకున్నాం. చెట్టు ఒకడు, గుట్టకు ఒకడు ఉన్నాడు. ఇవన్నీ గమనించి పేదల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నాం కేసీఆర్‌ తెలిపారు. వ్యవసాయ స్థీరికరణ జరగాలని రైతులను బాగు చేసుకున్నాం. రైతు బాగుంటే గ్రామం చల్లగా ఉంటుంది.. గ్రామం బాగుంటే దేశం చల్లగా ఉంటుందని రైతులను ఆదుకున్నాం. పెన్షన్‌ను 200 నుంచి రూ. 2 వేలకు పెంచుకున్నాం. సమాజానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వమే వారిని కాపాడాలని అధికారులకు చెప్పాను. అప్పుడు లెక్కలేసి.. రూ. 600 సరిపోతది అన్నారు. ఈ పేదోళ్ల వద్దనే కొసరల్నా అని పెన్షన్‌ వెయ్యి చేసుకున్నాం. సంపద పెరుగుతున్న కొద్ది పెన్షన్లు పెంచుకుంటూ పోయాం. అంతే కాకుండా కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలు అమలు చేశాం అని కేసీఆర్‌ తెలిపారు.
నెల రోజుల్లో బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తా
బోథ్‌: బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని ఊరూవాడ వెళ్లి కార్యకర్తలు ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సూచించారు. ఆనాడు తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ చచ్చుడో అన్నట్లు పోరాటం చేశానని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని మరోసారి తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని.. ప్రసంగించారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్‌?ఎస్‌ గెలవగానే నెల రోజుల్లో బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తానని సీఎం కేసీఆర్‌ మాట ఇచ్చారు. రైతులకు 24 గంటల కరెంటు కన్నా 3 గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అంటున్నారని విమర్శించారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమం కోసమే రైతు బంధు, రైతు బీమా  అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి  ని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అంటున్నారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇప్పుడు ధరణిని తీసేస్తే రైతు బంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని ఓటర్లను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వస్తే కచ్చితంగా దళారీల రాజ్యం వస్తోందని హెచ్చరించారు. ఈ పోర్టల్‌ వల్ల రైతులు గడప దాటకుండానే ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని హర్షించారు. అలాగే బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలో పోడు భూముల పట్టాలను పంపిణీ చేశామని వివరించారు.  ప్రజలు ఆలోచించి అభ్యర్థులకు ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. అందుకు ప్రజలకు ఉన్న ఏకైక ఆయుధం ఓటు. 1964 ఉద్యమంలో 400 మందిని కాంగ్రెస్‌ కాల్చి చంపింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత చెరువుల్లో పూడిక తీసి.. భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేశాం. కానీ కాంగ్రెస్‌ 58 ఏళ్ల పాలనలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. వారి పాలనలో కరెంటు, నీటి కష్టాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటిపై పన్నును రద్దు చేశామని తెలిపారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి పదేళ్లు అయిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని దుయ్యబట్టారు. కేంద్రం ఒక్క సైనిక పాఠశాలను కూడా రాష్ట్రానికి కేటాయించలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే బోథ్‌ నియోజకవర్గంలో కుట్టి రిజర్వాయర్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో పింఛను రూ.200.. అలాంటి పింఛన్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చి రూ.2000 చేసిందని పేర్కొన్నారు.
ఆ కాల్వ పూర్తయితే నర్సాపూర్‌ వజ్రపు తునకలా తయారవుతది
నర్సాపూర్‌ :ఒకప్పుడు నర్సాపూర్‌ నియోజకవర్గానికి మంచి నీళ్లు రాకపోయేది.. కానీ ఇప్పుడు కోమటిబండ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చాం.. ఇప్పుడు మంచినీళ్ల బాధ లేదు.. ఇక పిల్లుట్ల కాలువ ద్వారా సాగునీరు తీసుకొస్తే, నర్సాపూర్‌ వజ్రపు తునకలా తయారవుతదని అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.మంజీరా నది, హల్దీ నది ఎట్ల ఉండేది కాంగ్రెస్‌ రాజ్యంలో. ఎవరన్న పట్టించుకున్నడా..? ఇంకా వాళ్ల తెలివికి ఏం చేసిండ్రు అంటే ఈ రెండు నదుల విూ చెక్‌ డ్యాంలు కట్టొద్దని బ్యాన్‌ పెట్టిండ్రు. ఈ రోజు రెండు నదుల విూద చెక్‌ డ్యాంలు కడితే అవి ఇప్పుడు జీవనదుల్లా ఉంటున్నాయి. హల్దీ వాగుకు అయితే కాళేశ్వరం నీళ్లు పోసి ఎండకాలంలో మత్తళ్లు దుంకుతున్నాయి. బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి అని కేసీఆర్‌ తెలిపారు.ఒకప్పుడు నర్సాపూర్‌లో మంచీనీళ్లకు బాధలు ఉండే. కోమటిబండ నుంచి విూకు మంచి నీళ్లు వస్తున్నాయి. అనేకమైన బాధలు తీరినయి. ఒకసారి పిల్లుట్ల కాల్వ అయిపోయింది అంటే బ్రహ్మాండమైన నీటి పారుదల వచ్చి నర్సాపూర్‌ నియోజకవర్గంలో రైతులు మంచి పంటలు పండిస్తరు. వజ్రపు తునకలా తయారవుతుంది. పిల్లుట్ల కాల్వ అయిపోతే నేనొచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్లు తీసుకువస్తాను. ఆ బాధ్యత నాదే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.కులం, మతం అనే తేడా లేకుండా ముందుకు పోతున్నాం. దౌల్తాబాద్‌, కాసాలా మున్సిపాలిటీ కావాలని కోరారు. తప్పకుండా చేస్తాం.. అదేవిూ గొంతెమ్మ కోరిక కాదు. రంగంపేట మండలం కావాలని కోరారు. దాన్ని తప్పకుండా చేసుకుందాం. కౌడిపల్లికి డిగ్రీ కాలేజీ మంజూరు చేశాం. ఐటీఐ తప్పకుండా మంజూరు చేస్తాం. నర్సాపూర్‌లో చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. తెలంగాణను బంగారం లాగా కాపాడుకోవాలి అని కేసీఆర్‌ కోరారు.మదన్‌ రెడ్డి ఖాళీగా ఉండడు. ఆయన సముచితమైన, గౌరవప్రదమైన పదవిలో ఉంటారు. ఆయన నాకు చిరకాల, పాత మిత్రుడు. ఇవాళ కొత్తగా కాదు. ఆయన ఎమ్మెల్యే కావడానికి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఆ విషయాలన్నీ విూకు తెలుసు. సునీతా లక్ష్మారెడ్డి, మదన్‌ రెడ్డి కలిసి నర్సాపూర్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తరు. సునీతా లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను అని పేర్కొంటూ కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.