సానుభూతితోనే విజయం

హైదరాబాద్‌ : ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతితోనే వైకాపా విజయం సాధించిందని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన విశ్లేషణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో ఈ పరిస్థితి రాదని అభివృద్దే కొలమానంగా ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించామని కార్యకర్తలు ఇచ్చిన సలహాలు, సూచనలతో గెలుపు దిశగా ముందుకు సాగుతామని ‘దాడి’ అన్నారు.