సార్వత్రిక సమ్మె షురూ

హైదరాబాద్‌:డిమాండ్ల సాధన కోసం దేశంలోని 11 కార్మిక సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలోని కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గోంటున్నారు. కరీంనగర్‌ జిల్లా రామగుండం 1,2,3 ఏరియాల్లో సింగరేణి కార్మికులు ఉదయం విధులు బహిష్కరించారు. ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్‌, బెల్లంపల్లిలో కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలోని 19 గనుల్లో 20 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందులో సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గోంటున్నారు. వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో విధులకు హాజరవుతున్న సింగరేణి కార్మికులను కార్మిక సంఘాల నేతలు అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కొత్తూరు జూట మిల్లులో 7 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి సార్వత్రిక సమ్మెలో పాల్గోన్నారు.