సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని టొబాకోబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బజార్‌లోని మోహన్‌ టెక్స్‌టైల్స్‌లో మంటలు  ఎగిసిపడుతున్నాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నట్లు సమాచారం.