సిటీ ఫెసిలిటీ సంస్థపై కేసు నమోదు

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పివేసిన సిటీ ఫెసిలిటీ సంస్థపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఈ సంస్థ కొన్ని గంటలు పనిచేస్తే వేలాది రూపాయలు సంపాదించవచ్చని ఇచ్చిన ప్రకటనకు ఆకర్షితులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసి వేలాదిరూపాయలు డిపాజిట్ల కింద కట్టారు. చివరకు కట్టారు. ఎవరికీ డబ్బు ఇవ్వకుండానే సంస్థ బోర్డు తిప్పేయటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈరోజు కేసు నమోదుచేశారు.