సినీ నిర్మాత సి.కల్యాణ్ అరెస్ట్…
హైదరాబాద్: వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటనలో సినీ నిర్మాత సి.కల్యాణ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లోని విమల్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కల్యాణ్ అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న డాక్టర్ టి. కవితతో అసభ్యంగా ప్రవర్తించారు. ప్లాట్ అమ్మాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమెను దారికాచి చంపుతానంటూ బెదిరించారు. ఈ ఘటనపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు.