సిపిఆర్ పై అవగాహనా కలిగివుండాలి.
– మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
బెల్లంపల్లి, మార్చ్ 16, (జనంసాక్షి )
సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో మంచిర్యాల జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఆర్ ( కార్డియోపల్మనరీ రిసస్కీటేషన్ ) & ఏఈడి హృదయశ్వాసకోశ పునరుజ్జీవనం ( లైఫ్ సేవింగ్ టెక్నిక్ శిక్షణ ) అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు వలన అనేక మంది వారి విలువైన ప్రాణాలు కోల్పోయారని, ఐ సిపిఆర్ మరియు ఏఈడి వలన వారిని ఆకస్మిక గుండెపోటు నుంచి కాపాడే ప్రయత్నం చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరు ఈ మెలకువలు తెలుసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, డిఎంహెచ్ఓ సుబ్బారాయుడు, డిసిహెచ్ అరవింద్, ఆర్డివో శ్యామల దేవి, ఆసుపత్రి సూపరిండెంట్ రవి, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, ఎంపీపీ శ్రీనివాస్, తహసీల్దార్ కుమారస్వామి, వైద్యులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.