సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి పిఆర్టియు డిమాండ్
అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 1
అల్వాల్ పట్టణ కేంద్రంలోని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని
డిమాండ్ చేస్తూ పిఆర్టియు టిఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పిఆర్టియు టీఎస్ అల్వాల్ మండల శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు మెమోరడం సమర్పించడం జరిగింది. సందర్భంగా మండల శాఖ ప్రధాన కార్యదర్శి కైలాసపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ఉపాధ్యాయ సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో రాష్ట్రంలోని రాస్తారోకలు నిర్వహించి పాలనను స్తంభింప చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు వెంకటయ్య, శ్రీనివాస్ రెడ్డి, బలరాం, తదితరులు పాల్గొన్నారు.