సివిల్స్ ర్యాంకర్ అనుదీప్‌కు సిఎం కెసిఆర్ అభినందన
ప్రగతి భవన్‌లో కలసి భోజనం చేసిన సిఎం
హైదరాబాద్,మే7(జనం సాక్షి): సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా టాప్ ర్యాంకర్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో అనుదీప్, ఆయన తల్లిదండ్రులతో కలిసి సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. యువతకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎంపీలు కవిత, బాల్క సుమన్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కె. విద్యాసాగరరావు, శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఫారుఖ్, కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ యువతకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారన్నారు. అనుదీప్ పై ప్రశంసల వర్షం కురిపించారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే.. తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శనమన్నారు. అనుదీప్ ను సత్కరించారు సీఎం కేసీఆర్. ఇటీవల వెలువడిన సివిల్స్ 2017 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సివిల్స్ సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. సివిల్స్ మొదటి ర్యాంకు సాధించిన అనుదీప్‌ది జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వాసి.
సివిల్స్ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్ కు 55.60 శాతం మార్కులు వచ్చాయి. మొత్తం 2 వేల 25 మార్కులకు అనుదీప్ వెయ్యి 126మార్కులు (రాతపరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176) సాధించారు.
—–