సీఎంగా బాధ్యతలు స్వీరరించాలని శెట్టారును ఆహ్వనించిన గవర్నర్‌

కర్నాటక: కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని బీజేపీ సీనియర్‌నేత జగదీశ్‌ శెట్టార్‌ను కర్నాటక గవర్నర్‌ ఆహ్వనించారు. శెట్టార్‌ మంత్రివర్గం ఏర్పాటు చేసే వరకు సదానందగౌడ అపదర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని గవర్నర్‌ కార్యలయం పేర్కోంది. నిన్నటి వరకు అసమతి సెగలతో రగిలిన కర్నాటక బీజేపీలో నాయకత్వ మార్పుతో అసమ్మతికి ఎట్టాకేలకు తెరపడింది. అధిష్టానానికి కంట్లో నలుసుల తయరయిన కర్నాటక జీజేపీ నేతల వ్యవహారం చక్కదిద్దుకుంది. సదానందగౌడ రాజీనామా చేయడంతో యాడ్యురప్ప చిరునవ్వులు చిందించాడు. పార్టీ సీనియర్‌ నేత జగదీష్‌షెట్టర్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది అధిష్టానం. సదానందగౌడ వర్గం నేతలకు మంత్రి పదవులు ఎక్కువగా ఇవ్వటమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించాలని పార్టీ అధినేతలకు సదానందగౌడ కరాకండిగా చెప్పారు.