సీఎంను కలిసిన సింగరేణి కార్మిక సంఘాలు

హైదరాబాద్‌: సింగరేణి కార్మిక సంఘాలు ఇవాళ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశాయి. టీబీజీకేఎస్‌ నేత కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో సీఎంను కలిసిన కార&ఇమక సంఘాల నేతలు సింగరేణిలో కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. సకల జనుల సమ్మెలో ఇచ్చిన అడ్వాన్స్‌లను స్పెషల్‌ ఇన్సెంటీవ్స్‌గా గుర్తించాలని వారు ఈ సందర్భంగా సీఎంను కోరారు. ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేసియా చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఎమ్మెల్సీ వెంకట్రావు, ఐఎస్‌టీయూసీ ఇతర సింగరేణి కార్మిక నేతలు ఉన్నారు.

తాజావార్తలు