సీఎంను కలిసిన సినీ నిర్మాతలు

హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు వినోదపు పన్ను రాయితీ కల్పించాలని కోరుతూ సినీ నిర్మాతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కోరారు. చిరంజివి నేతృత్వంలో నిర్మాతలు డి.సురేష్‌బాబు, అల్లుఅరవింద్‌, కె.ఎస్‌. రామారావు, కల్యాణ్‌, అశోక్‌కుమార్‌, తదితరులు ముఖ్యమంత్రితో సమావేశమాయ్యారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అత్యధికంగా 14.5 శాతం వ్యాట్‌ వాసులు చేయడాన్ని సీఎం దృష్ఠికి తీసుకేళ్లారు. వినోదపుపన్ను పాటు వ్యాట్‌ వాసులు మన రాష్ట్రంలోనే ఉందని వారు తెలిపారు. తమ విజ్ఞప్తి సీఎం సానుకూలంగా స్పదించారని ప్రభుత్వ నుండి సమాధానం వచ్చే వరకు ఈ నెల 5వ తేదిన ప్రతిపాదించిన బంద్‌ను వాయిదా వేస్తున్నాట్లు నిర్మాత సురేష్‌బాబు తెలిపారు.