సీఎం కిరణ్‌పై మండిపడ్డ పాల్వాయి గోవర్థన్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు 45 టీఎంసీల నీళ్లు అంటున్నారు కానీ, తెలంగాణకు 600 టీఎంసీల నీళ్లు దక్కాలని తెలియజేశారు. 45 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి తాము బిచ్చగళ్లమా అని ప్రశ్నించారు. పోలవరంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం  జరపాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. కొంత మంది సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని, తమ మాట వినేలా చేసుకుంటామని అన్నారు. చీఫ్‌ ఇంజనీర్ల దందాపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రాణహిత- చేవేళ్ల పథకం బోగస్‌ ప్రాజెక్టు అని విమర్శించారు.