సీఎం కేసీఆర్‌కు శస్త్రచిక్సిత

` విరిగిన తుంటి ఎముక
` నిలకడగా ఆరోగ్యం
` కేసీఆర్‌ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌ స్పందన
` పర్యవేక్షించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి ఆదేశం
హైదరాబాద్‌(జనంసాక్షి):ఎర్రవల్లిలోని తననివాసంలో గురువారం రాత్రి బాత్‌  రూంలో కాలుజారిపడటంతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌ రావు ఎడమకాలితుంటి ఎముక ప్రాక్చర్‌ అయింది. వెంటనే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారికి యశోద దవాఖానాలో డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు. సిటీ స్కాన్‌ చేసిన వైద్యులు ఎడమకాలి తుంటి విరిగిందని, శస్త్రచికిత్స ద్వారా రీప్లేస్‌ చేయాల్సి వస్తుందని డాక్టర్లు హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేశారు. కోలుకోవడానికి ఇందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుదని తెలిపారు.కేసీఆర్‌ ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ వెంట భార్య శోభమ్మ, తనయుడు మాజీ మంత్రి కేటీఆర్‌.. కూతురు కవిత  ఎంపీ సంతోష్‌ కుమార్‌, మాజీ మంత్రి హరీష్‌ రావు తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. వార్త తెలిసిన నేపధ్యం లో పరామర్శించేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు ఆస్పత్రికి భారీగా తరలివస్తున్నారు. కాగా కెసిఆర్‌ కు శస్త్ర చికిత్స జరుగుతున్న నేపద్యంలో డాక్టర్స్‌ ఎవరిని అనుమతించడం లేదు. నేతలు, అభిమానులు కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని, యశోదా ఆస్పత్రి వద్ద భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి యశోద హాస్పిటల్‌కు వెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్‌ సెక్రటరీకి యశోద వైద్యులు తెలియజేశారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.  కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించిన విషయం తెలిసిందే. గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ క్లియరెన్స్‌తో కేసీఆర్‌ను పోలీస్‌ అధికారులు ఆసుపత్రికి తరలించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కేసీఆర్‌ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు. ఆపరేషన్‌ చేసి తుంటి ఎముక రీప్లేస్‌ చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద వైద్యులు బులెటిన్‌లో వెల్లడిరచారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అధినేత ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రిలోని వివిధ విభాగాల వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  గురువారం అర్థరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు కేసీఆర్‌ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నారు. మరోవైపు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ కూడా స్పందించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడ్డట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని వెల్లడిరచారు. కేసీఆర్‌పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు యశోద ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్‌ చేయనున్నారు. కేసీఆర్‌కు తొంటి ఎముక రెండు చోట్ల విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు ఆపరేష్‌ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే వైద్యులు వెల్లడిరచారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి యశోద ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.హెల్త్‌ బులెటిన్‌ విడుదల.. కేసీఆర్‌ హెల్త్‌ బులెటిన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ వైద్యుల పరిరక్షణలో ఉన్నట్లు తెలిపారు. కాగా గురువారం రాత్రి ఫామ్‌ హౌస్‌ బాత్‌ రూమ్‌లో జారి పడ్డారు. దీంతో ఆయన తొంటికి తీవ్ర గాయమైంది. కుటుంబసభ్యులు ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టరు.. తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్లు గుర్తించారు. ఈ రోజు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు. తుంటి ఎముకకు స్టీల్‌ ప్లేట్స్‌ వేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. తుంటి బాల్‌ కూడా డ్యామేజ్‌ అయినట్లు వైద్య బృందం గుర్తించింది. కాగా హాస్పిటల్‌లో కేసీఆర్‌ వెంట కవిత, కేటీఆర్‌, హరీష్‌ రావు ఉన్నారు.
కెసిఆర్‌ ఆరోగ్యంపై చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ ట్విట్లు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. తగిలిన గాయం త్వరగా మానాలని కోరారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా కేసీఆర్‌ ఆరోగ్యంపై స్పందించారు. గాయం నుంచి కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కూడా స్పందించారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. ‘‘కేసీఆర్‌కు గాయమైందని తెలిసి బాధపడ్డాను. సంపూర్ణంగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆయనకు అనారోగ్య పరిస్థితులు మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉంది. పూర్తి స్వస్థత పొంది మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలను కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని కోరారు.