సీఎం కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేయండిఅలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

అలంపూర్ జూన్ 7(జనంసాక్షి) 12వ తేదీ జరగబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని అల్లంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అన్నారు.
అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో గురువారం అలంపూర్,ఉండవల్లి ,మానవ పాడు,వడ్డేపల్లి మండలాల ప్రజా ప్రతినిధులు మరియు ముఖ్య నాయకులతో అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం అబ్రహం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ ఈ నెల 12 తేది సోమవారం సీఎం కేసీఆర్ గద్వాల పర్యటన సందర్బంగా గద్వాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం,జిల్లా ఎస్పీ కార్యాలయం, బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవాలకు విచ్చేస్తున్నారు అన్నారు.అదేవిధంగా మధ్యాహ్నం 3:00 గంటలకు గద్వాల జిల్లా కేంద్రంలోని అయిజ రోడ్ దగ్గర జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,యూత్ సభ్యులు,ప్రజలు, రైతులు మహిళలు గ్రామ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి సభ ను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు