సీఎం పర్యటనలో ప్రమాదం

నరసాపురం: ముఖ్యమంత్రి పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇందిరమ్మ బాట కార్యాక్రమంలో భాగంగా పవ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం స్వర్ణాంధ్ర కళాశాలలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్న ఇద్దరు సమాచార శాఖ ఏఈలు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో ఏఈలు భరత్‌, ధనుంజయరావుల కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.