సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

కొత్తూరు వైద్యురాలు కల్పన,
ఖానాపురం సెప్టెంబర్ 22జనం సాక్షి
 సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని కొత్తూరు సబ్ సెంటర్ వైద్యురాలు కల్పనఅన్నారు. గురువారం మండలంలోని కొత్తూరు సబ్ సెంటర్ పరిధిలో రాగం పేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి
అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.  ఈ క్యాంపులో సుమారు 98 మందికిబిపి,షుగర్, మలేరియా,రక్తపూతల,పరీక్షలు చేసి
జ్వరం జలుబు దగ్గు ఇతర సాధారణ వ్యాధులకు మందులు పంపిణీ చేసినట్లు వైద్యురాలుకల్పనతెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ కల్పనమాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ డ్రై డే పాటించాలని అన్నారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ముఖ్యంగా
 దోమల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు
రజిత, జ్యోతి,హెల్త్ అసిస్టెంట్స్ గొడి శాల భాస్కర్,
బద్రు నాయక్,ఆశాలుసంధ్య సులోచన
 తదితరులు పాల్గొన్నారు.
Attachments area