సీనియర్‌ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: రైతుల సమస్యల పరిష్కారంపై పార్టీ సోమవారం  తలపెట్టిన ధర్నాపై తెదేపా అదినేత చంద్రబాబునాయుడు సీనియర్‌ నేతలతో చర్చించారు. అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలతో చంద్రబాబు ఈ ఉదయం తన నివాసంలో భేటీ అయ్యారు. రేపు ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద భారీ  ఎత్తున చేపట్టే నిరసనను విజయవంతం చేయడానికి కృషి చేయాలని నేతలను కోరారు. ఇప్పటికే రైతుల సమస్యలపై అన్ని జిల్లాల్లో చేపడుతున్న ఆందోళనలు, ధర్నాలపై ఆయన సమీక్షించారు.