సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు ఏసీబీ ఎదుట హాజరయ్యారు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు ఏసీబీ ఎదుట హాజరయ్యారు. గాలి బెయిల్‌కు సంబంధించి విచారణలో పలు కీలక అంశాలను రాబట్టినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో ఉమామహేశ్వరరావు కూడా పాలు పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.