సీనియర్‌ సిటిజన్‌ లోక్‌ అదాలత్‌లో తొలిరోజు విచారణ

హైదరాబాద్‌: కన్నబ్డిల నుంచి జీవన భృతి కోరుతూ కేసులు వేసిన వృద్దులు ఎక్కువగా ఉన్నారని సీనియర్‌ సిటిజన్‌ లోక్‌ అదాలత్‌ అధ్యక్షులు జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి చెప్పారు. ఈ మధ్యనే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ ప్రారంభించిన సీనియర్‌ సిటిజన్‌ లోక్‌ అదాలత్‌ విభాగంలో ఇవాళ తొలిసారిగా విచారణ నిర్వహించారు. కనురెప్పలా కాపాడిల్సిన కన్నబిడ్డలు తల్లిదండ్రుల్నే గెంటివేసే పరిస్థితుల నుంచి తమను రక్షించాలని పలువురు వృద్దులు లోక్‌ అదాలత్‌లో మొరపెట్టుకున్నారు. ఇవాళ పదిహేను కేసులు లోక్‌ అదాలత్‌ బెంచ్‌ ముందుకు రాగా వాటిలో రెండు అనర్హమైనవిగా కొట్టేశారు. మరో ఎనిమిది కేసుల్లో వృద్దుల కూతుళ్లు కొడుకులు బెంచ్‌ ముందు హజరు కావాలని జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసుల సంఖ్యను వారానికోసారి విచారణ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.