సీబీఐ విచారణకు హాజరైన వుడా మాజీ వీసీ

ఎంవీపీ కాలనీ, విశాఖ: వుడా భూకుంభకోణం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారి వి. ఎస్‌. విష్ణు  సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వుడా వీసీగా విష్ణు పనిచేస్తున్న సమయంలో భూకుంభకోణం జరిగిందని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.