సీమాంధ్రులను సచివాలయం నుంచి సాగనంపండి


అక్రమ డిప్యూటేషన్లను ఆపండి
జస్టిస్‌ రాయకోట్‌ కమిషన్‌ నుంచి తెలంగాణేతరులను తొలగించండి
సీఎం కార్యాలయం ముందు టీఎన్‌జీవోల ధర్నా
హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) 610 జీ.వో. అమలులో భాగంగా ప్రభుత్వ వేసిన జస్టిస్‌ రాయక్‌ట్‌ ఏఊకసభ్య కమిషన్‌లోని సభ్యులకు తెలంగాణ ప్రాంతం వారిని కాకుండా ప్రాంతీయేతరులను నియమించడాన్ని తెలంగాణ ఉద్యోగుల సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కమిషన్‌లో స్థానికేతరుల నియామకాన్ని నిరసిస్తూ మంగళవారం సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ‘సి’ బ్లాక్‌ ఎదుట ఉద్యోగులు, నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీ.ఎన్‌.జీ.ఒల సంఘం అరికట్టడానికి 610 జి.ఓ. తెచ్చిన ప్రభుత్వం జీ.వో. అమలు కావడంపై జస్టిస్‌ రాయకోట్‌ కమీషన్‌ను నియమించిందన్నారు. కమీషన్‌లో 13 సభ్యులకు గాను తెలంగాణ వారి వాటా 42 శాతం ప్రకారం ఆరుగురు సభ్యులు తెలంగాణ వారు ఉండాల్సిన వుండగా నిబంధనలకు విరుద్ధంగా కర్నాటక నుండి డెప్యుటేషన్‌పై వచ్చిన ఇద్దరిని, కర్నూలుకు చెందిన ఒక్కొరిని సభ్యులుగా నియమించారని , ఇది నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు. కమీషన్‌ నియామకంలో కూడా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరిని మార్చాలని డిమాండ్‌ చేశారు. లేని ఏడల రేపు ఉద్యోగ సంఘాలు సమావేశమై భవిష్యత్‌ పోరాట ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. అనంతరం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వినయ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాలు నేతలు శ్రీనివాస్‌గౌడ్‌ , దేవిప్రసాద్‌, నరేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.