సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు తీరనిద్రోహం

` మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం.. ఉద్యమిస్తాం
` కాంగ్రెస్‌, టీడీపీలే ఆ ప్రాంతానికి తీవ్ర ద్రోహం చేశాయి
` పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రధాన ఎజెండా పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టు అంశమే..
` దీనిపై కేంద్రాన్ని ఎండగట్టి పెద్దఎత్తున ఉద్యమిస్తాం
` ఇవాళ్టి వరకూ ఒక కథ రేపటి నుంచి మరో కథ ఉంటుంది
` ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చినా పట్టించుకోలేదు
` ఇప్పటికైనా ఉద్యమించకపోతే మొదిటికే ముప్పువచ్చే పరిస్థితి
` ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగుతా..
` ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం
` పచ్చి అబద్దాల వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు
` విలేకరుల సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్‌, 20 ఏళ్లు పాలించిన టీడీపీ ప్రభుత్వాలు పాలమూరు జిల్లాకు తీరని ద్రోహం చేశాయని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో ప్రధాన ఎజెండా పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపైనే జరిగిందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే ఈరోజు సమావేశంలో చర్చించామని వెల్లడిరచారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరేనని, 174 టీఎంసీల నీరు పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులకు రావాల్సి ఉందని కేసీఆర్‌ అన్నారు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వమని కేసీఆర్‌ మండిపడ్డారు. జంటనగరాల్లో పట్టపగలే హత్యలు జరుగుతున్నా అడిగే దిక్కులేదన్నారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారమే తెలంగాణలో 20శాతం క్రైమ్‌రేట్‌ పెరిగిందన్నారు. పచ్చి అబద్దాల వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటే తెలంగాణ, ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపంగా మారిందని కేసీఆర్‌ అన్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కిలో విూటర్లు ప్రవహించినా అప్పట్లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందలేదని కేసీఆర్‌ వివరించారు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు తాము చాలా వాదించి, ఉద్యమ సమయంలో పాలమూరుకు జరిగిన అన్యాయం వివరించినట్లు తెలిపారు. రాష్ట్రాల మధ్య వివాదాలే పరిష్కరిస్తామని ట్రైబ్యునల్‌ చెప్పిందన్న కేసీఆర్‌ బచావత్‌ ట్రైబ్యునల్‌ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. పాలమూరు కోసం గంటెడు నీళ్లు అడిగిన వాళ్లే అప్పుడు లేరని కేసీఆర్‌ చెప్పారు. 1974లో బచావత్‌ ట్రైబ్యునల్‌ 17 టీఎంసీలు జూరాలకు సుమోటోగా కేటాయించినా దాన్ని పట్టించుకున్నవారే లేరని ధ్వజమెత్తారు. పాలమూరు నుంచి ముంబయికి విస్తృతంగా వలసలు ఉండేవని, గోరటి వెంకన్న కూడా పాలమూరు వలసలపై పాట రాశారని కేసీఆర్‌ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి పేరిట చంద్రబాబు సభలు పెట్టారన్నారు. జూరాల ప్రాజెక్టు కోసం పరిహారం డబ్బు చంద్రబాబు కట్టడం లేదని తన విమర్శలకు తట్టుకోలేక కర్ణాటకకు డబ్బు చెల్లించారన్నారు. తాను ఉద్యమం మొదలుపెట్టాక తొలిసారి జోగులాంబ గద్వాల పాదయాత్ర చేసినట్లు తెలిపారు. ఎంతో అధ్యయనం చేశాకే జోగులాంబ` గద్వాల పాదయాత్ర చేశామన్నారు. ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పాటైందని, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుకకు నెట్టివేయబడ్డ రాష్ట్రమని పదే పదే చెప్పినట్లు గుర్తుకుచేశారు. ఆనాడు పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందన్న కేసీఆర్‌ రాష్ట్రం వచ్చాక ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశామన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్‌ పూర్తి చేసి ఆర్డీఎస్‌ ద్వారా జరిగిన నష్టం భర్తీ చేశామన్న కేసీఆర్‌ భూగర్భజలాల ద్వారా మరో లక్షన్నర ఎకరాల ఆయకట్టు వచ్చిందని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాకు 170 టీఎంసీలు తీసుకెళ్లాలన్నది బీఆర్‌ఎస్‌ సర్కారు వ్యూహమని, దానిలో భాగంగా చెరువుల లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించామన్నారు. తాము పాలమూరు జిల్లాకు 90.81 టీఎంసీలు కేటాయించామన్నారు. పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 80 టీఎంసీల గోదావరి నీరు వాడుకుంటోందని చెప్పారు. ఆ 80 టీఎంసీలు బచావత్‌ ట్రైబ్యునల్‌ ద్వారా ఎగువ రాష్ట్రాలకు ఇస్తామని ఏపీ చెప్పిందని గుర్తుచేశారు. కర్ణాటక, మహారాష్ట్ర చెరో 20 టీఎంసీలు వాడుకుంటుండగా తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీలు పాలమూరుకు వాడుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాలమూరుపై కేంద్రాన్ని ఎండగట్టి పెద్దఎత్తున ఉద్యమిస్తామని కేసీఆర్‌ తెలిపారు. భారీ బహిరంగ సభలు పెడుతున్నామని తాను సభలకు రానున్నట్లు వెల్లడిరచారు. ప్రభుత్వం నోరుమూసుకుని ఉంటే తామైనా పూనుకోవాలి కదా అని అన్నారు ఇవాళ్టి వరకూ ఒక కథ రేపటి నుంచి మరో కథ ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామన్న ఆయన మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉందని ఇక ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం ఉంది? అని ప్రశ్నించారు. తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్‌ తెలిపారు.పాలమూరులో గ్రామగ్రామన డప్పుకొట్టి ఉద్యమించనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ కోసం ఎందాకైనా పోరాడతామని ఎలాంటి మొహమాటాలు ఉండవని స్పష్టం చేశారు. కళ్ల ముందే మోసం జరుగుతుంటే కేసీఆర్‌ ఎలా ఊరుకుంటాడు? అని పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వమని, జంటనగరాల్లో పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి అడిగే నాధుడేలేడని అన్నారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వంపై జనం రోజురోజుకూ విశ్వాసం కోల్పోతున్నారని చెప్పారు. చైనా తరహాలో ఫార్మా సిటీ కట్టాలని తాము భూమి సేకరించామని, 400 ఏళ్ల చరిత్రతో హైదరాబాద్‌ వైబ్రాంట్‌ సిటీ అయ్యిందన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మా సిటీ ప్లాన్‌ చేశామన్నారు ఫ్యూచర్‌ సిటీ పేరుతో జరిగేదంతా రియల్‌ఎస్టేట్‌ దందానే అని విమర్శలు గుప్పించారు. ఫార్మా సిటీ కోసమే వాడతామన్న నిబంధనతో భూసేకరణ చేశామన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మేం ఇలాంటి చిల్లరపనులు చేయలేదని కేసీఆర్‌ తెలిపారు. బిజినెస్‌ విూటింగ్‌లకు ఆద్యుడు చంద్రబాబని, ఆయన మొదటిసారి సీఎం అయినప్పుడు విశాఖలో బిజినెస్‌ విూటింగ్‌ పెట్టారన్నారు. అప్పట్లో విశాఖ ఎంవోయూల్లో వంట మనుషులు సంతకాలు పెట్టారు, అవన్నీ నిజమైతే లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి కదా ప్రశ్నించారు. తాము బిజినెస్‌ విూటింగ్‌లు పెట్టలేదన్న కేసీఆర్‌ మంచి పాలసీలతోనే పెట్టుబడుదారుల్నీ ఆకర్షించినట్లు తెలిపారు. గతంలో ఫాక్స్‌కాన్‌ కంపెనీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తే రూ.3,000 కోట్లు ఎదురు ఇస్తామని మహారాష్ట్ర తీసుకుపోయిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేదని ఇక కోటీశ్వరులను ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. తాము భూముల ధరలు పెంచగలిగామని నాలుగు ఎకరాలు ఉన్నవాడు ధీమాగా ఉండేవాడని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల ధరలు కుప్పుకూలాయన్న కేసీఆర్‌ రైతులను, ఉద్యోగులను అందరినీ ఏడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పులు కట్టలేకపోతున్నామని అంటే కాగ్‌ చెంపలు వాయించిందని గుర్తుచేశారు. ఎక్కడ మాట్లాడినా కేసీఆర్‌ చచ్చిపోవాలనే మాట్లాడతారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో కోపం వస్తే ఒక మాట అనొచ్చు కానీ ప్రతిసారీ నాపైనే శాపనార్థాలు పెడతారా? అని ఆక్షేపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఎక్కువ జలదోపిడీ
` 811 టీఎంసీల నికర జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం చేసింది కేసీఆరే
` ఇప్పటికైనా ప్రతిపక్ష నేత బయటకు రావడం చాలా సంతోషకరం
` ఆయన అసెంబ్లీకి వస్తే.. నీటివాటాపై చర్చిస్తాం
` పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు
` కృష్ణా జలాల్లో 71శాతం వాటా కావాలని మేం కొట్లాడుతున్నాం
` కేసీఆర్‌, కేటీఆర్‌ ఆర్థిక ఉగ్రవాదులు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ ఇప్పటికైనా బయటకు రావడం చాలా సంతోషకరమని సీఎం రేవంత్‌రెడ్డి (ఖీవలజీనిబిష్ట్ర తీవటటవ)అన్నారు. విూడియా సమావేశంలో కేసీఆర్‌ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్‌ హయాంలోనే నీటి వాటాల విషయంలో తెలంగాణ అన్యాయం జరిగిందని సీఎం అన్నారు. చెప్పిన అబద్దాలు చెప్పకుండా.. అబద్దాలనే పెట్టుబడిగా మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలోనే ఎక్కువ జలదోపిడీ జరిగిందన్నారు. ‘‘811 టీఎంసీల నికర జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం చేసింది కేసీఆరే. నీటి వాటాలపై సంతకం చేసి 3 జిల్లాలకు మరణ శాసనం రాశారు. కృష్ణా జలాల్లో 71శాతం వాటా కావాలని కొట్లాడుతున్నాం. ఏపీ జలదోపిడీకి దోహదం చేసింది కేసీఆరే. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని కేసీఆర్‌ అడగలేదు. కృష్ణా, గోదావరి జలాల వాటాపై జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం. కేసీఆర్‌, కేటీఆర్‌ ఆర్థిక ఉగ్రవాదులు. అసెంబ్లీ సమావేశాలకు రావాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత బయటకు రావడాన్ని స్వాగతిస్తున్నా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.