పదేళ్లలో మీరేం చేశారు?

` ఎస్‌ఎల్‌బీసీ,దిండి,పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు?
` ఈ విషయాన్ని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల ప్రజలే కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు
` ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రాజెక్టులపై విషయంలో అవాస్తవాలు చెప్పడం తగదు
` రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు
` కృష్ణా జలాల విషయంలో పాలమూరు, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది కేసీఆరే
` తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
` కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్‌ గురించి మాట్లాడుతున్నారా?
` కాళేశ్వరాన్ని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ, సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుబట్టారు
` కవిూషన్ల కోసమే ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచారు
` కేసీఆర్‌ విమర్శలపై మంత్రి ఉత్తమ్‌ కౌంటర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌.. పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీ, దిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని తెలంగాణ నీటిపారుదలశాఖ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్‌ చేసిన విమర్శలపై మంత్రి ఉత్తమ్‌ స్పందించారు.‘‘పాలమూరు, దిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల ప్రజలు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అవాస్తవాలు చెప్పడం పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు తగదు. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్థంగా ముందుకెళ్తోంది. కృష్ణా జలాల విషయంలో పాలమూరు, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది కేసీఆరే. రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న పెండిరగ్‌ ప్రాజెక్టులను కేసీఆర్‌ ఎందుకు పూర్తి చేయలేదు? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్‌.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోవడానికి కారణం కేసీఆర్‌. కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్‌ గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణ తీరును నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ, సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుబట్టారు. కవిూషన్ల కోసమే ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచారు’’ అని మంత్రి ఉత్తమ్‌ విమర్శనాస్త్రాలు సంధించారు.