సీమాంధ్రుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వం

నర్సంపేట, మే 25(జనంసాక్షి) : సీమాంధ్రుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వమని జేఎసి రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు కత్తి వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని రామకృష్ణ డిగ్రి కళాశాల ఆవరణలో జేఎసి అత్యావసర సమావేశాన్ని లెక్చరర్స్‌ జేఎసి కన్వీనర్‌ మాచర్ల రమేష్‌ అధ్యక్షతనజరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటస్వామి మాట్లడుతూ సీమాంధ్ర పాలకుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వకుండా సజీవంగా బతికించుకునేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర పాలకుల కుట్రలు, కుతంత్రాలను అడ్డుకుంటూ ప్రజా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. టిజేఎసిలో చీలికలు తీసుకొచ్చి వాదాన్ని నిర్వీర్యం చేసి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కొద్దిమంది పని కట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన జరిగే హాని ఏమి ఉండదన్నారు. ఉద్యమాన్ని మరింత కిందిస్థాయికి తీసుకెళ్లడానికి త్వరలో జేఎసి కార్యచరణ ప్రకటించి ఉద్యమం ఉదృతిని పెంచడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.జేఎసి ఆధ్వర్యంలో కోదండరాం చేస్తున్న పాదయాత్రకు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో జేఎసి జిల్లా కో చైర్మన్‌ అంబటి శ్రీనివాస్‌, మహిళ జేఎసి కన్వీనర్‌ గుడిపుడి అరుణా రాంచందర్‌, విద్యార్థి జేఎసి కనీవనర్‌ తాళ్ల సునిల్‌, మండల జేఎసి కన్వీనర్లు బోనగాని రవిందర్‌, జమాండ్ల చంద్రమౌళి, నూకల కృష్ణమూర్తి, షేక్‌ జావీద్‌, మల్లయాచారి, బొట్ల పవన్‌, రజినీకాంత్‌, చేరాలు, జగన్మోహన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.సింగరేణిని నిర్వీర్యం చేసిన జాతీయ సంఘాలు…!