సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్‌ మిశ్రా కన్నుమూత

భువనేశ్వర్‌ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్‌ మిశ్రా కన్నుమూశారు. 1990 సెప్టెంబరు 25 నుంచి నాలుగెళ్లపాటు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు తొలి ఛైర్మన్‌గా పనిచేశారు.