సుమన్‌ మృతికి పలువురు మంత్రుల సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, దర్శకుడు,నటుడు సుమన్‌ (45) మృతి పట్ల మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, బాలరాజు, అనం,డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.