సుమన్‌ మృతి పట్ల గవర్నర్‌ నరసింహన్‌ పరామర్శ

హైదరాబాద్‌: సుమన్‌ మృతి పట్ల రాష్ట్ర గవర్నర్‌ ఇన్‌.ఎల్‌. నరసింహన్‌ సంతాపం ప్రకటించారు. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావును ఆయన ఫోనులో పరామర్శించారు. సమన్‌ అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్‌ రామోజీరావుకు తెలిపారు. భగవంతుడు సమన్‌ కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, సుమన్‌ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థస్తున్నట్లు చెప్పారు.