సూడాన్‌లో విమాన ప్రమాదం- 32మంది మృతి

ఖార్టోమ్‌:సూడాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కేబినెట్‌ మంత్రితో సహ 31 మంది మృతి చెందారు. దక్షిణ కోర్దోఫ్యాన్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఈద్‌ సంబరాల్లో పాల్గొనేందుకు వెళుతున్న అధికారిక బృందం సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారందరూ మరణించారని సూడాన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.